
కుల గణన ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి
హుస్నాబాద్: తాజాగా 2024 కుల గణన ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జీకే ఫంక్షన్‌లో లంబాడీల భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల గిరిజన సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కొంత మంది కాంగ్రెస్‌కు చెందిన గోండు, ఆదివాసీ నాయకులు బంజారులను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కుట్రపూరితంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారన్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా అక్టోబర్ 8న హుస్నాబాద్‌లో 10 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు భిక్షపతి నాయక్, హేమ నాయక్, తిరుపతి నాయక్, రాజు నాయక్, కృష్ణా నాయక్, మోహన్ నాయక్, హరియా నాయక్ ఉన్నారు.
మాట్లాడుతున్న
గిరిజన సంఘాల నాయకులు