
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఎస్‌ఐ మురళీ తెలిపిన వివరాల ప్రకారం... మండలలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన రాయోల్లి వెంకయ్య(67) స్థానిక పెట్రోల్‌బంక్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 28న ఉదయం విధులు ముగించుకుని 765డి జాతీయ రహదారిపై నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాడు. కాగా అతన్ని వెనక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. బాధితున్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయించి అనంతరం మంగళవారం గాంధీకి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.