
విద్యుత్ బల్బు సరి చేస్తుండగా..
షాక్‌కు గురై రైతు మృతి
దుబ్బాకరూరల్: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన రైతు కంతుల రాజమల్లయ్య(58) మంగళవారం తన కోళ్ల ఫారంలోకి కోడి పిల్లలను తీసుకు వచ్చాడు. సాయంత్రం వెళ్లి చూడగా విద్యుత్ బల్బు రాకపోవడంతో అక్కడే విద్యుత్(బుడ్డి)పై బల్బును కట్టెతో సరి చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా బల్బుకు ఉన్న వైరు తెగి వచ్చి అతని మెడకు చుట్టుకుంది. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ ఉన్న వ్యక్తి గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీంటి పర్యంతమయ్యారు.