ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్‌ ఆవిష్కరణ

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

ఇబ్రహీంపట్నం: ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పేరుతో ముద్రించిన వాల్‌ పోస్టర్‌ను బీజేవైఎం నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బూర అభినయ్‌గౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి వనవాడ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.కార్తీక్‌గౌడ్‌, కంబాలపల్లి శశిధర్‌రెడ్డి, శాంతి, వినయ్‌, భారత్‌, బీరప్ప, వంగ సంజీవరెడ్డి, విశాల్‌, సాయితేజ, సందీప్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement