ఈ– సేవ భవనానికి తాళం | - | Sakshi
Sakshi News home page

ఈ– సేవ భవనానికి తాళం

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

ఈ– సేవ భవనానికి తాళం

చైతన్యపురి: నిత్యం రద్దీగా ఉండే ఈ– సేవ భవనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు కేటాయిస్తే ఊరుకోబోమని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం కాలనీ వాసులతో కలిసి వికాస్‌నగర్‌లోని ఈ– సేవ భవనానికి ఆయన తాళం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం మూడువేల గజాలు స్థలం కేటాయించిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇవ్వకుండా పోలీస్‌ స్టేషన్‌కు అడ్డా లేకుండా చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుత పోలీస్‌ స్టేషన్‌ను ఖాళీ చేయాల్సి ఉండగా ఏడాది కాలంగా ప్రభుత్వ చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. న్యూదిల్‌సుఖ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లోకి ఈ– సేవ కేంద్రాన్ని మార్చాలని చూస్తున్నారని అన్నారు. కాలనీలలోని కమ్యూనిటీ హాళ్లను ఇతరులకు కేటాయించే అధికారం జీహెచ్‌ఎంసీకి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement