నగదు కావాలంటే.. వికారాబాద్‌కు వెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

నగదు కావాలంటే.. వికారాబాద్‌కు వెళ్లాలి

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

ఖాతాదారులకు ఏటీఎం కష్టాలు

ధారూరు: ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని ఏటీఎం కేంద్రాల వినియోగం తగ్గుముఖం పట్టింది. దీంతో బ్యాంకర్లు ఏటీఎం సెంటర్లను క్రమంగా తగ్గిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ల ఆపరేటింగ్‌, ఆన్‌లైన్‌ గురించి తెలియనివారు ఏటీఎంలను ఆశ్రయించడం పరిపాటి. అయితే ఏటీఎంలు తగ్గిపోవడం, ఉన్నవి సక్రమంగా పనిచేయకపోవడం లేదా.. సాంకేతిక లోపంతో తాత్కాళికంగా మూతపడుతుండటంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ధారూరులో 1978లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ శాఖ ప్రారంభమైన సుదీర్ఘకాలం అనంతరం రోడ్డు పక్కనే ఇటీవల ఓ ఏటీఎం కేంద్రం ప్రారంభించారు. కానీ అది ఎప్పుడూ సరిగా పనిచేయక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిన్‌మార్పిడి చేసుకోవాలన్నా, మినీ స్టేట్‌మెంట్‌ తీసుకోవాలన్నా, ఇతరత్రా సేవలు, అత్యవసరంగా డబ్బులు కావాలంటే తాండూరు, వికారాబాద్‌లకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఏటీఎం యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని బ్యాంకు అధికారులను కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement