అండర్‌పాస్‌ల నిర్మాణానికి వినతి | - | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌ల నిర్మాణానికి వినతి

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

చేవెళ్ల: హైదరాబాద్‌– బీజాపూర్‌ రహదారి విస్తరణలో పలు గ్రామాలకు వెళ్లే మార్గాల వద్ద అండర్‌ పాస్‌లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కోరారు. ఈమేరకు చేవెళ్ల నాయకులతో కలిసి వెళ్లి ఢిల్లీలో కొండాను కలిశారు. రోడ్డు విస్తరణలో పలు చోట్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీకి వివరించారు. ఆయా గ్రామాలకు వెళ్లేలా అండర్‌పాస్‌లు, సర్వీస్‌ రోడ్లు నిర్మించేలా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఎంపీని కలిసిన వారిలో నాయకులు రాంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, దర్శన్‌, వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్‌, ఆగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభాకర్‌, గోనె ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాములు, మధుసుదన్‌గుప్తా, రవీందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement