‘పట్నం’లో పోలీసుల మోహరింపు | - | Sakshi
Sakshi News home page

‘పట్నం’లో పోలీసుల మోహరింపు

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

‘పట్నం’లో పోలీసుల మోహరింపు

ఇబ్రహీంపట్నం: మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నక్కర్తమేడిపల్లికి వెళ్లకుండా ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్‌ కార్యాయలంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి వారికి నచ్చజెప్పారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫార్మాసిటి భూములపై తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని బహిరంగచర్చకు రావాలని సవాల్‌ విసిరితే ఎందుకు ఎమ్మెల్యే తప్పించుకున్నారని ప్రశ్నించారు. భూముల కబ్జాలు, ఆక్రమణలపై ఆయన స్వగ్రామైన తోర్రూర్‌లోనే బహిరంగ చర్చ పెడతానన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement