చెరువులు, చేపల పెంపకం వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వాళ్లకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాలు బోగస్ లబ్ధిదారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఆయా పథకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశాం. తనిఖీలు చేసిన అధికారులు ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు తేల్చారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశాం. మత్స్య సొసైటీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి. చెరువులను పూర్తిగా వృత్తిదారులకే అప్పగించాలి.
– జి.సురేష్, ఫిషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీ, గూడూరు


