విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

షాద్‌నగర్‌రూరల్‌: విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని జాతీయ బీసీసేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ అన్నారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆదివారం పట్టణంలోని జాతీయ బీసీసేన కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బర్క కృష్ణయాదవ్‌ విద్యార్థులను శాలువాతో సన్మానించి కేకు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సన్మానం పొందిన వారిలో విద్యార్థులు మాధుర్య, భువనచంద్ర, రేవంత్‌, సమశ్రిత, శ్రీయాన్విక ఉన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్‌యాదవ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి జయశ్రీకాంత్‌, కోర్‌ కమిటీ సభ్యులు చెన్నబాల్‌రాజ్‌, శ్రీకాంత్‌, డిప్యూటీ సర్పంచ్‌ గంగాధర్‌, యాదయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement