మొయినాబాద్: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ ఏర్పడి నీరు వృథాగా రోడ్డుపై పారుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలోని చిలుకూరులో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ నాలుగు రోజులుగా లీకవుతోంది. దీంతో నీరంతా ప్రధాన రోడ్డుపై నుంచి గ్రామంలోని అంతర్గత రోడ్డులోకి వెళ్తున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నీళ్లు నిలవడంతో బురదమయంగా మారింది. దీంతో విద్యార్థులు చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్తున్న దుస్థితి ఏర్పడింది. ఈ విషయమై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీకి మరమ్మతులు చేయించి.. అంతర్గత రోడ్డు బాగు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పహాడీషరీఫ్: ఫోన్ చూ డొద్దంటూ సోదరుడు మందలించడంతో యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లి గ్రామానికి చెందిన బారు బుచ్చయ్య కుటుంబం బతుకుదెరువు నిమిత్తం మామిడిపల్లి గ్రామానికి వలస వచ్చి మెగా వైడ్ కంపెనీలో పనిచేస్తూ, లేబర్ క్యాంప్‌లో నివాసం ఉంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ చూడొద్దంటూ అతని పెద్ద కుమారుడు అరుణ్ గత నెల 20వ తేదీన చిన్న కుమారుడు మధు(17)ను మందలించాడు. మరుసటి రోజు ఉదయం లేచిచూడగా, మధు కనిపించలేదు. అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ