మొయినాబాద్: భిన్న సంస్కృతులు.. సాంప్రదాయ వస్త్రధారణ.. సంగీతం, నృత్య ప్రదర్శనలతో చైనత్య డీమ్డ్ టూబీ విశ్వవిద్యాలయ ప్రాంగణం కళకళలాడింది. మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం సాంప్రదాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయ వస్త్రధారణతో నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్స్‌లర్ డాక్టర్ సీహెచ్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు, సాంప్రదాయ విలువలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. శనివారం జరిగే యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ సాత్వికరెడ్డి, వైస్ ఛాన్స్‌లర్ జి.శంకర్‌లింగం, రిజిస్ట్రార్ ఎం.రవీంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాంబాబురెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


