మొయినాబాద్: కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అక్కడి సీఎం విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. గురువారం మొయినాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేరళం సీఎం విజయన్ ఒక్కటే అని రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేరళంలో విద్యా రంగానికి 24 శాతం నిధులు కేటాయిస్తున్నారని, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. కేరళం ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికొదిలేసిందని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కేవలం ఉచిత బస్సు తప్పా మిగతా పథకాలను అమలు చేయడంలేదన్నారు. సీపీఎం దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై అలుపెరుగని పోరాటం చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కేరళం సీఎం విజయన్‌కు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు ప్రభుదాస్, మల్లారెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, నర్సింహ, లక్ష్మయ్య ఉన్నారు.
సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి దేవేందర్


