వికారాబాద్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా అనిల్‌యాదవ్‌ | - | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా అనిల్‌యాదవ్‌

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా 33వ వార్డు కౌన్సిలర్‌ అనిల్‌ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్‌లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు, ముఖ్య నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వికారాబాద్‌ డీసీసీ కార్యవర్గం ఏర్పాటు

అనంతగిరి: కాంగ్రెస్‌ వికారాబాద్‌ జిల్లా కార్యవర్గాన్ని గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఆనందం, అంజయ్యగౌడ్‌, శోభారాణి, నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాస్‌, సిరాజుద్దీన్‌, అశోక్‌, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, అశోక్‌, సత్యమ్మ, మధుసూదన్‌రెడ్డి, సంతోష్‌, హరీశ్వర్‌రెడ్డి, బాబుసింగ్‌, వెంకటయ్య, కోశాధికారిగా విశ్వనాథం రాఘవేందర్‌, అధికార ప్రతినిధులుగా ఆనంద్‌గౌడ్‌, అడ్వకేట్‌ గోపాల్‌, కార్యదర్శులుగా చంద్రశేఖర్‌, రాజవర్ధన్‌రెడ్డి, ఎండీ నసీరుద్దీన్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మొగులప్ప, నర్సింలు గౌడ్‌, వెంకటేశం నర్సింగ్‌ నాయక్‌, బాబాఖాన్‌, ప్రభాకర్‌, బాల్‌రెడ్డి, వీరన్న, అనంత్‌రెడ్డి, మాసయ్య, రవినాయక్‌, నరేందర్‌రెడ్డి, రహీం పటేల్‌, రజితారెడ్డి, మాణిక్యం గౌడ్‌, కార్యవర్గ సభ్యులుగా గోపా ల్‌, మహ్మద్‌ యాసిన్‌, అమృతప్ప, నయీంఅక్తర్‌, శ్రీనివాస్‌, రాములు, జంగయ్య, కోడ య్య, యాదయ్య, అక్బర్‌ హుస్సేన్‌, శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి సిద్ధార్థ నియమితులైనట్లు తెలిపారు.

డివైడర్‌ పైకి

దూసుకెళ్లిన లారీ

తాండూరు టౌన్‌: పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. నాపరాయి లోడ్‌తో కొడంగల్‌ మార్గం నుంచి పట్టణంలోకి ఫ్లై ఓవర్‌ మీదుగా వచ్చిన లారీ, అతి వేగంగా బస్టాండు ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేదా అతి వేగం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement