ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

నాణ్యమైన ఆహార పదార్థాలే

విక్రయించాలి

టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌పాషా

పరిగి: ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటం ఆడితే సహించేది లేదని టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌పాషా హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యానగర్‌ కాలనీలో మటన్‌ షాపులో నిర్వహిస్తున్న యజమాని ఇంట్లో 35 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్‌ చేశారు. కృష్ణ అనే వ్యక్తి వద్ద సిలిండర్లు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేసి 12 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీం దుకాణాలపై దాడులు చేసి కల్తీ సామగ్రిని సీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement