భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు
భూ సమస్యలపై అందిన దరఖాస్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ‘ధరణి’పోర్టల్‌ను తీసుకొస్తే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోర్టల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ‘భూభారతి’ పోర్టల్‌ను తీసుకొచ్చింది. పేరు మారిందే కానీ.. భూ బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వ ‘పెద్ద’ల సిఫార్సులు, పైరవీకారులు తీసుకొచ్చిన వివాదాస్పద భూముల ఫైళ్లు మాత్రం చకచక కదులుతున్నాయి. సామాన్యుల అర్జీలు మాత్రం ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే మిగిలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తాము పెట్టుకున్న అర్జీ ఏ దశలో ఉందో..? చెప్పే నాథుడు కూడా లేడని అసహనం వ్యక్తం చేస్తున్నారు
ఫైళ్లు తొక్కిపెట్టి.. అక్రమ వసూళ్లు
భూ భారతి పోర్టల్‌కు ఇప్పటి వరకు 3,84,474 దరఖాస్తులు అందగా, వీటిలో 1,70,052 దరఖాస్తులు మాత్రమే ఆమోదానికి నోచుకోగా.. 1,51,26 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కొంత మంది అధికారులు ఏళ్ల నుంచి ఫైళ్లు తొక్కిపెట్టి భూముల ధలను బట్టి.. కమీషన్లు దండుకుంటున్నారనే అపవాదు ఉంది. వారి షరతులకు అంగీకరించిన వాళ్ల ఫైళ్లను క్లియర్ చేస్తూ.. నిరాకరించిన వారివి తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఇదే తంతు కొనసాగుతోందనే చర్చలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్‌ఐలు ఏసీబీ వలకు చిక్కిన విషయం విదితమే. అక్రమార్కులపై ఏసీబీ వల విసురుతున్నా.. అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఆ అర్టీలే అధికం
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14 మాడ్యుల్స్‌ను తీసుకొచ్చింది. గతంలో ప్రతీ చిన్నపనికి కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చేది. చిన్న చిన్న సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పోర్టల్‌లో ఆ అవకాశం కల్పించలేదు. దీంతో సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది. సత్వర పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు లాగిన్లు ఇచ్చింది. అయితే ఆయా అధికారులు సైతం సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిషేధిత జాబితా, డేటా కరెక్షన్‌కు వచ్చిన దరఖాస్తులు ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయి. పోర్టల్‌లోని పెండింగ్ జాబితాలో మెజార్టీ దరఖాస్తులు ఇవే ఉండడం గమనార్హం.
భూభారతిలో 19 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్
పోర్టల్ పేరు మారినా తీరని సమస్యలు
కలెక్టరేట్ చుట్టూ బాధితుల
ప్రదక్షిణలు
మాడ్యుల్ అప్లికేషన్లు ఆమోదం తిరస్కరణ పెండింగ్
ఎన్‌ఆర్‌ఐ పీపీబీ 1,084 597 413 33
కోర్టు కేస్ ఇంటిమేషన్ 60,344 31,845 23,332 495
కోర్టు కేస్ పీపీబీ 8,809 2,106 4,916 763
డేటా కరెక్షన్ 66,255 7,197 22,119 9,565
జీపీఏ 15,883 9,429 4,046 99
గ్రీవెన్స్ ప్రొహిబిటెడ్ 74,678 26,499 41,593 6,586
ఖాతా మెర్జింగ్ 1,036 567 345 17
లాండ్ మేటర్ గ్రీవెన్స్ 49,445 26,308 23,109 28
నాలా పీపీబీ 3,770 1,677 1,339 180
ఆర్గనైజేషన్ పీపీబీ 1,089 1,079 05 01
పెండింగ్ మ్యూటేషన్ 61,892 37,993 18,991 981
సక్సేషన్ 34,654 22,858 8,111 544
అర్బన్ ల్యాండ్ 3,168 1,183 1,622 125
నాలా హౌస్‌సైట్స్ 2,367 714 1,305 55
డివిజన్ అర్జీలు ఆమోదించినవి తిరస్కరించినవి
చేవెళ్ల 1,06,973 50,572 40,334
ఇబ్రహీంపట్నం 87,949 36,012 35,811
కందుకూరు 92,409 39,732 37,406
రాజేంద్రనగర్ 39,408 17,076 15,491
షాద్‌నగర్ 57,735 26,660 22,204


