షాద్‌నగర్: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్‌ను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుకాణాల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పౌల్ట్రీ పరిశ్రమల వారు చికెన్ సెంటర్లుకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం షాపుల నిర్వహణ కూడా భారంగా మారిందని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు దుకాణాలను తెరిచేదిలేదని స్పష్టంచేశారు.


