నేడు తుమ్మలూరుకు సీఎస్‌, కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు తుమ్మలూరుకు సీఎస్‌, కలెక్టర్‌

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

నేడు తుమ్మలూరుకు సీఎస్‌, కలెక్టర్‌ నేడు వైన్స్‌ బంద్‌ ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి దరఖాస్తుల ఆహ్వానం త్రిపుర గవర్నర్‌కు ఘన స్వాగతం గ్రామ సభలను విజయవంతం చేయండి

మహేశ్వరం: ప్రజా పాలనలో భాగంగా తుమ్మలూరులో నిర్వహించనున్న గ్రామ సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) రామకృష్ణారావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి హాజరవనున్నట్లు ఎంపీడీఓ శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 10.30 గంటలకు నిర్వహించే ఈ సభకు గ్రామస్తులంతా హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు

ఇబ్రహీంపట్నం రూరల్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఫ్యూచర్‌సిటీ సీపీ జి.సుఽధీర్‌బాబు బుధవారం ఆదేశాలిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్‌ ఎకై ్సజ్‌ యాక్ట్‌ 1968లోని సెక్షన్‌ 20 ప్రకారం ఈ నెల 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కమిషనరేట్‌పరిధిలోని అన్ని వైన్స్‌ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్టార్‌ హోటళ్లు, రిజిస్ట్రర్‌ క్లబ్‌లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు

కొత్తూరు: ఎస్సీ నిరుద్యోగులకు కార్పొరేషన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సోలార్‌ పంప్‌సెట్లు, పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ అరుంధతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 8లోపు ఓబీఎంఎంఎస్‌ తెలంగాణ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు రేషన్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ, లైసెన్స్‌, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌, ఫొటో, పట్టాదారు పాస్‌బుక్‌ జిరాక్స్‌ జతచేయాలని సూచించారు. యూనిట్‌కు తొంభైశాతం సబ్సిడీ లభిస్తుందన్నారు.

బడంగ్‌పేట్‌: త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం నాదర్‌గుల్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నాదర్‌గుల్‌కు చేరుకుని ఇంద్రసేనారెడ్డిని సన్మానించారు.

డీపీఓ సురేశ్‌ మోహన్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌ మోహన్‌ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామసభ గురించి పంచాయతీలో విరివిగా ప్రచారం చేయాలన్నారు. ఎక్కువ మంది ప్రజలు పాల్గోనే విధంగా అధికారుల, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. గ్రామసభ నివేదికను ముందస్తుగా నిర్ణయించుకుని, గ్రామసభ పది గంటలకు ప్రారంభమయ్యేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు వారికి సమాచారం ఇచ్చి భద్రత ఏర్పాటు చేయించుకోవాలన్నారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ఎస్‌జీహెచ్‌ సభ్యులు, యువత, రైతులు, మహిళ సంఘాలు, ఎన్‌జీఓలు, పథక లబ్ధిదారులు అభిప్రాయ సేకరణ, గ్రామ సమస్యలపై చర్చించాలని వివరించారు. గ్రామసభలో మాట్లాడే వ్యక్తల, లబ్ధిదారుల జాబితాను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యల నివేదిక, 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు, ఖర్చులు చదివి వినిపించాలి. డీసీబీ 2026–27 గ్రామ సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి. ఫిర్యాదుల కోసం పెట్టెను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, డివిజన్‌ పంచాయతీ అధికారులు, గ్రామసభల నిర్వహణపై పర్యవేక్షించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement