మొయినాబాద్: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తనను గుర్తించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రభాకర్‌రెడ్డికి సన్మానం..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డిని పలువురు నాయకులు సన్మానించారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండి గణేశ్, కౌన్సిలర్ కళ్లెంల జగపతి, మాజీ సర్పంచ్ గొర్కంటి రాజు, నాయకులు మాధవరెడ్డి తదితరులు ఆయన్ను సన్మానించి అభినందనలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


