క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

కేశంపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని నిర్దవెళ్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, లింగంధన సర్పంచ్‌ వెంకటయ్య, తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, తౌర్యానాయక్‌, భూపాల్‌రెడ్డి, ఆంజనేయులు, జంగయ్య, రాంరెడ్డి, పల్లాటి కృష్ణయ్య, మురళీమోహన్‌, పాండు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement