కొందుర్గు రెవెన్యూ సర్వేనంబర్ 75, 76, 80లో నాతో పాటు మరో 34 మందికి 12.15 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఏళ్లుగా పట్టా భూమిగా రికార్డు ఉంది. ధరణి పోర్టల్‌లో వక్ఫ్ భూమిగా రికార్డు చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి, రికార్డులను సరి చేయాల్సిందిగా కోరుతూ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నా. ఆయన వక్ఫ్‌బోర్డుకు రాశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. సమస్య తీరలేదు. – పి.చంద్రశేఖర్, కొందుర్గు
ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నంబర్ 41లో 3.20 ఎకరాల భూమి ఉంది. 1944 నుంచి చివరి పహాణి వరకు చెక్ చేసి, అన్ని సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే 2017లో ఈ భూమి కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్ తర్వాత నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ జాబితా నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతూ మూడేళ్ల నుంచి తహసీల్దార్ మొదలు.. కలెక్టర్ కార్యాలయం వరకు దరఖాస్తులు ఇచ్చా. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా.
– పాతూరి ప్రకాశ్, ఇబ్రహీంపట్నం


