ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, మేనేజర్ ఆంజనేయులు సమక్షంలో నిర్వహించిన ఈ వేలంలో 18 మంది డిపాజిట్‌దారులు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో జనిగల గిరియాదవ్ రూ.19.87 లక్షలకు తై బజారును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, వెంకటయ్య, ఎర్రవోలు మహేశ్ పాల్గొన్నారు.
కుల్కచర్ల: వానాకాలం సాగును దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమై న విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వా లని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వీర స్వామి, ఏఈఓ బాబు పాల్గొన్నారు.


