కాంస్య పతకం కై వసం.. అభినందించిన సీపీ
ఇబ్రహీంపట్నం రూరల్: షూటింగ్ పోటీల్లో ఫ్యూచర్‌సిటీ సీఐ జేమ్స్‌బాబు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ బోపాల్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 0755 ఇండియా ఓపెన్ కాంపిటిషన్ (ఎయిర్ రైఫిల్, పిస్టల్) మార్చి 11 నుంచి 17 వరకు జరిగాయి. ఈ టోర్నీలో ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఐటీసెల్ ఇన్‌చార్జిగా పని చేస్తున్న సీఐ జేమ్స్‌బాబు రాణించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు సీఐని అభినందించారు. విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో ప్రతిభ చూపి, పోలీసుశాఖకు వన్నె తెచ్చా వని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్
షాద్‌నగర్: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఆర్టిజన్లు సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు ఎంతో ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకుండా సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, శేఖర్, యాదగిరి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


