‘పీఠం’ ముడి వీడేనా..? | - | Sakshi
Sakshi News home page

‘పీఠం’ ముడి వీడేనా..?

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసింది. గత నెల 11న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వచ్చాయి. 16న సమావేశం నిర్వహించి కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జరగాల్సిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి తిరుగుబాటుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య వివాదాలు రాజుకోవడంతో ఫిబ్రవరి 17న ఏర్పాటు చేసిన ఎన్నిక సైతం పడింది. ఈ వివాదాలు న్యాయస్థానాలకు చేరాయి. ఈ దశలో నాలుగువారాలలోపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని గత మార్చి 3న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తాజాగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. ముందుగా కౌన్సిలర్లుకు నోటీసులు ఇచ్చి ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజు(5వ తేదీ) నిర్వహించాల్సి ఉంటుంది.

ఈసారైన పీఠముడి వీడేనా....

ఽఅధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు మున్సిపల్‌ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు జిత్తులు వేస్తుండటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురింది. బీఆర్‌ఎస్‌కు మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నా వివిధ వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఈసారైన పీఠం ముడి విడుతుందా లేక మళ్లీ వివాదాల్లో చిక్కుకొని వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తేలాలంటే వచ్చే 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement