మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు’ అని ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. డివిజన్‌లో ఆదివారం మర్రి ఆధ్వర్యంలో శ్యామ్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా 240 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, 2డీఎకో, రక్త పరీక్షలు చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆహార నాణ్యతలేమితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి మరింత ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కలమ్మ జంగయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్‌గౌడ్, ఇబ్రహీంపట్నం జెట్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్రీశైలం, వైద్యులు రంగరాజ్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


