ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు భూమిలోకి అక్రమంగా చొరబడి భయబ్రాంతులకు గురి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిబట్ల ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లో కోహినూర్ వెంచర్‌లోకి అదే ప్రాంతానికి చెందిన మహేశ్, రాజు, భాస్కర్, ప్రభాకర్, తిరుపతి భాస్కర్, శివప్రసాద్‌తో పాటు మరి కొందరు ఆదివారం మధ్యాహ్నం చొరబడి సెక్యూరిటీ వారిని బెదిరింపులకు గురి చేశారు. మహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్షలు
కేశంపేట: వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు విద్య నేర్పి ంచారు. వీరికి ఆదివారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. మండలంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1600 మంది మహిళలు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 1260 మంది హాజరయ్యారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, వేములనర్వ గ్రామాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలను వయోజన విద్యా కేంద్రం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనిత పరిశీలించారు.


