పీఆర్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై అవగాహన అవసరమని తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గుర్రం ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ లర్నింగ్ ఎగ్జిబిషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా కూడా ఆంగ్లం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. హెచ్‌ఎం పరమేశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం కళా శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.


