ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్
మొయినాబాద్‌రూరల్: నక్కలపల్లిలో చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించలేవని మృగవని నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం సాయంత్రం నక్కలపల్లిలో చిరుత సంచరిస్తుందని పలువురు చూసినట్లు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన బుధవారం గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్‌గౌడ్, గ్రామస్తులతో కలిసి చిరుత పులి కనిపించినట్లు చెప్పిన స్థలాన్ని పరిశీలించారు. పాదల ముద్రల ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


