మరింత జఠిలం | - | Sakshi
Sakshi News home page

మరింత జఠిలం

Mar 26 2026 10:52 AM | Updated on Mar 26 2026 10:52 AM

స్టీల్‌ కంపెనీలో పేలుడు పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. 8లోu

రీచార్జి గుంతలు

తవ్వాల్సిందే..

స్టీల్‌ కంపెనీలో పేలుడు పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.

రాక్‌షీట్‌ జోన్‌లో ఆశించిన స్థాయిలో ఇంకని వర్షపు నీరు

సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లలో 12 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు

‘సాక్షి’తో భూగర్భ జలవనరులశాఖ అధికారి మాధవరావు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నెత్తిన నిండు కుండలా తొనికిసలాడే జంట జలాశయాలు ఉన్నా.. వాటి కింది భాగంలోని గండిపేట, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి మండలాల్లోని భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కురిసిన ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే.. భూగర్భ జలాల మనుగడ కొనసాగుతుంది. లేదంటే భవిష్యత్‌ తరాలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు’అని భూగర్భ జల వనరులశాఖ జిల్లా అధికారి మాధవరావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఈ ఏడాది భూగర్భజల మట్టం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అధిక వినియోగం ఆ నీటి మట్టాన్ని మరింత లోతుకు దిగజార్చుతోంది. ప్రధానంగా గండిపేట పరిసర ప్రాంతాల్లోని కోకాపేట్‌, నియోపోలీస్‌, శేరిలింగంపల్లి ఏరియాల్లో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ 70 మీటర్ల లోతుకు వెళ్తే కానీ.. ఆనవాళ్లు కన్పించడం లేదు.

24 బేసిన్లు.. 90 ఫీజో మీటర్లు

భూగర్భ జలాల అధ్యయనం కోసం జిల్లాను 24 బేసిన్లుగా విభజించాం. ఒక్కో మండలంలో మూడు చొప్పున జిల్లా వ్యాప్తంగా 90 ఫీజో మీటర్లను ఏర్పాటు చేశాం. ఆయా ఫీజో మీటర్లను సెన్సార్‌ టెలిమెట్రీ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేశాం. ఆయా బోరుబావుల్లో ఉన్న నీటిమట్టాన్ని ప్రతీనెలా రికార్డు చేస్తున్నాం. జిల్లాలో పట్టణీకరణ, నిర్మాణాలు ఎక్కువగా ఉన్న గండిపేట, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మణికొండ, నియోపోలీస్‌, కోకాపేట వంటి ప్రాంతాలన్నీ పూర్తిగా రాతిపొరలతో కూడి ఉన్నాయి. వీటి నెత్తిన జంట జలాశయాలున్నా.. రాక్‌షీట్‌, కాంక్రీట్‌ జంగిల్‌ వల్ల ఆశించిన స్థాయిలో నీరు ఇంకని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ 250 అడుగులు దాటితే కానీ నీటి ఆనవాళ్లు కన్పించడం లేదు.

కాంక్రీట్‌ జంగల్‌గా మారడంతో..

వ్యవసాయ భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. సీసీ రోడ్లు, భారీ నిర్మాణాలతో పూర్తిగా కాంక్రీట్‌ జంగల్‌గా మారింది. సెప్టెంబర్‌/అక్టోబర్‌ మాసాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూమి పొరల్లోకి ఆశించిన స్థాయిలో నీరు ఇంకకపోవడం.. చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా కన్పించకుండా పోతోంది. డిసెంబర్‌ చివరిలో కొంత ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు.. మార్చి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. శేరిలింగంపల్లిలో డిసెంబర్‌లో 11.93 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. ఫిబ్రవరి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే మూడు మీటర్ల లోతుకు పడిపోయింది. ఇక సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లలో 9 మీటర్ల నుంచి 12 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. సాధారణంగా వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లోనే వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రతీ ఇంటికి విధిగా ఒక రీచార్జి గుంతను తవ్వాలి. ఇంటిలోని బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండాలంటే వాన నీటి ఇంకుడు గుంతలే ఏకై క మార్గం. నాలుగు నుంచి ఆరు అడుగుల విస్తీర్ణం, ఎనిమిది అడుగుల లోతులో గుంతను తవ్వుకోవాలి. గుంత కింది నుంచి 4 అడుగుల వరకు 40 ఎంఎం కంకర వేసుకోవాలి. ఆ తర్వాత రెండు అడుగులు 20 ఎంఎం కంకర, ఆపైన దొడ్డు ఇసుక వేసుకోవాలి. గుంట చుట్టూ గోడకట్టాలి. ఇంటిపై కురిసిన వర్షపు నీరు పైపుల ద్వారా నేరుగా గుంతలో పడేలా చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. పాడైన బోరు బావుల చుట్టూ తవ్వుకుని, కేసింగ్‌పైపు చుట్టూ కంకర, ఇసుకను అమర్చి, పైపు చుట్టూ చిన్న చిన్న రంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. వరదనీటిని ఊరి చివరలో వట్టిపోయి వృథాగా ఉన్న పాడుబడ్డ బావిలోకి మళ్లించడం ద్వారా కూడా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement