కడ్తాల్: మానవాళికి ప్రాణ వాయువు అందిస్తున్న వృక్షాలపై ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానం, గౌరవభావం కలిగి ఉండాలని సీజీఆర్ చైర్‌పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని శ్రీరామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో, సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి దంపతులు ‘రావిచెట్టు–వేప చెట్టు’కు వృక్ష కల్యాణం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వృక్షాలు భగవంతుడి ప్రతి రూపాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, ఉప సర్పంచ్ మహేశ్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఇందిరా, మాజీ సర్పంచ్ శంకర్, వేద పండితులు వెంకటేశ్వర శర్మ, నాయకులు జగన్‌గౌడ్, వెంకటయ్యగౌడ్, పాపిరెడ్డి, భజ్యా శ్రీనునాయక్, తదితరులు పాల్గొన్నారు.


