రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యానారాయణ
ఇబ్రహీంపట్నం రూరల్: రిటైర్డ్ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ పెన్షనరీ రూల్స్ అమలు చేయాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ శర్మ, జనరల్ సెక్రెటరీ సుధాకర్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
తైబజార్ వేలం వాయిదా
యాచారం: మాల్ పశువుల సంత నిర్వహణ వేలం బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద పోటాపోటీగా జరిగింది. పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పలువురు పోటీపడగా అందులో మాల్ గ్రామానికి చెందిన నిమ్మరాజు జంగయ్య రూ.1.05 లక్షలకు దక్కించుకున్నాడు. కాగా తైబజార్ వేలం వాయిదా పడింది.


