చేవెళ్ల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి చెందుతాయని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్‌మోహన్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రేగడిఘనాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పని మాధవిరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఈదులపల్లి మహేశ్వరిరాములు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు.
డీపీఓ సురేశ్‌మోహన్


