రేపు సోమనాథ్
జ్యోతిర్లింగ దర్శనం
తాండూరు టౌన్: తాండూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి భక్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జ్యోతిర్లింగ దర్శనం, పూజ, సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేయి ఏళ్లకు పైగా చరిత్ర గల సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకోవాలన్నారు. వివరాలకు 7036666047, 9482678441 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
వడ్డీ వ్యాపారికి రిమాండ్
తాండూరు రూరల్: మహిళ మృతికి కారణమైన వడ్డీ వ్యాపారిని ఆదివారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కరన్‌కోట్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలతోని సిరిగిరిపేట్‌కు చెందిన అగ్గనూర్ లక్ష్మీ, వీరప్ప దంపతులు. వీరు గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్మంత్‌రెడ్డి రూ.లక్ష అప్పు తీసుకున్నారు. వ్యవసాయంలో నష్టం వాటిల్లి అప్పు చెల్లించడంలో ఆలస్యమైంది. దీంతో వారం రోజుల క్రితం హన్మంత్‌రెడ్డి అతని భార్య ఉమాదేవి బాధితురాలి ఇంటికి వెళ్లి అవమాన పరిచారు. దీంతో ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మృతికి వడ్డీ వ్యాపారి హన్మంత్‌రెడ్డి, ఉమాదేవి దంపతులే కారణమని మృతురాలి భర్త వీరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పదిరోజులైనా నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో బాధితులు శనివారం ఎస్పీ స్నేహమెహ్రని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా ఇదే విషయమై శ్రీసాక్షిశ్రీదినపత్రికలో ప్రచురితమైన శ్రీవై నాట్ అరెస్ట్‌శ్రీకథనంపై జోరుగా చర్చజరిగింది. కాగా హన్మంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించిన విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
షాద్‌నగర్‌రూరల్: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆలయ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు(70) అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
ఎస్పీ స్నేహమెహ్ర సీరియస్‌తో రంగంలోకి పోలీసులు