పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

మహేశ్వరం: పేదలకు సొంతింటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని రామచంద్రగూడ సర్పంచ్‌ కాట్రావత్‌ దేవినాయక్‌ అన్నారు. శుక్రవారం ఆమె గ్రామంలో ఆరు ఇందిరమ్మ ఇళ్లను గృహం ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వం అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామంలో ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, యూజీ పనులు, హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఉపాధి హామీ ఏపీఎం పరిమిళ, ఉప సర్పంచ్‌ అంగోత్‌ భాస్కర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అంగోత్‌ కృష్ణ నాయక్‌,ఎల్గని సిద్దేశ్వర్‌ గౌడ్‌, కాట్రావత్‌ దేవేందర్‌ నాయక్‌, మాజీ ఉప సర్పంచ్‌ కాటారం అభిలాశ్‌ గౌడ్‌. వెంకటేశ్‌ గౌడ్‌,శంకర్‌ నాయక్‌, చంద్రు, రెడ్యా, పంచాయతీ కార్యదర్శి జయదీప్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందని గంగారం సర్పంచ్‌ మునావత్‌ దేవేందర్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం ఆయన మంఖాల శ్రీనాథ్‌ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మహేందర్‌, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు పాండు నాయక్‌, నాయకులు రవి నాయక్‌, ధర్మ, గోపి, శ్రీనివాస్‌, భాస్కర్‌, దేవా, కార్యదర్శి నవీన్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement