మరకత శివాలయం సన్నిధిలో రిటైర్డ్‌ ఐజీ | - | Sakshi
Sakshi News home page

మరకత శివాలయం సన్నిధిలో రిటైర్డ్‌ ఐజీ

Mar 20 2026 9:16 AM | Updated on Mar 20 2026 9:16 AM

శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని గురువారం రిటైర్డ్‌ ఐజీ మల్లారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రిటైర్డ్‌ ఐజీ దంపతులకు శేష వస్త్రం, ఆలయ ప్రతిమను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఐజీ మాట్లాడుతూ.. పురాతన మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. మల్లారెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రాన్స్‌కో, ఏసీబీ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ విభాగాల్లో పని చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు హన్మంతు, భీంరెడ్డి, అర్చకుడు ప్రమోదు తదితరులు పాల్గొన్నారు.

23న భగత్‌సింగ్‌ విగ్రహావిష్కరణ

షాద్‌నగర్‌: పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఈ నెల 23న భగత్‌సింగ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ప్రజా సంఘాల నాయకులు గురువారం తెలిపారు. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌ హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌రాజు, శ్రీను నాయక్‌, ఈశ్వర్‌, కుర్మయ్య, వెంకటరమణ, శ్రీకాంత్‌, నర్సింలు, సత్యం, కరుణాకర్‌, జనార్ధన్‌, బాలు నాయక్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement