అన్నదాతకు తీపి కబురు 22 నుంచి ఖాతాల్లో పంట సాయం జమ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటన ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మందికి లబ్ధి
సాక్షి, రంగారెడ్డిజిల్లా : ఉగాది పర్వదినం రోజు ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ 22 నుంచి ఖాతాల్లో రైతు భరోసా జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నగదును పంట సాయంగా అందజేయనుంది. మూడు విడతల్లో నగదు జమ చేయనుంది. ఈ మేరకు గురువా రం ఉగాది వేడుకలను పురస్కరించుకుని పంచాంగ పఠనం కార్యక్రమం అనంతంరం సీఎం చేసిన ఈ ప్రకటనతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఐదున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో ఒక ఎకరం వరకు, రెండో విడతలో రెండు ఎకరాల వరకు, మూడో విడతలో ఆ తర్వాతి విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం
2.5 ఎకరాలలోపు రైతులు : 1.56,355
2.5 నుంచి 5 ఎకరాల లోపు : 56,853
ఐదు నుంచి పది ఎకరాల లోపు : 25,888
పది నుంచి 25 ఎకరాల లోపు : 7,118
25 ఎకరాలకుపైగా ఉన్న రైతులు : 744
రంగారెడ్డి జిల్లాలో ఇదీ లెక్క


