షాద్‌నగర్: హిందూవాహిని ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బీజేపీ నాయకులు బండారి రమేష్, అందె బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, చెట్ల వెంకటేశ్, ప్యాట అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి, మురళి, మహేశ్, శేఖర్, రాఘవేందర్, మంగ శ్రీశైలం, రమేష్, రాజశేఖర్, శీలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


