చేవెళ్ల: ఉగాది రోజున పేదలు సగర్వంగా సొంతింటిలోకి అడుగుపెట్టడం శుభ సూచకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ పరిధిలోని మొండివాగులో అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమతారెడ్డి, మిషనర్ వెంకటేశ్‌ం, ఊరెళ్ల కౌన్సిలర్లు మల్లేశ్, సువర్ణలతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందన్నారు. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్లు శైలజ, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి, నాయకులు శివకుమార్, వెంకట్‌రెడ్డి, ఆగిరెడ్డి, శివప్రసాద్, రాజు, జహంగీర్, చందు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
ఇండిరమ్మ ఇల్లు ప్రారంభం
కొత్తూరు: కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని కొత్తూరు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పెంజర్ల గ్రామంలో సర్పంచ్ జగన్‌తో కలిసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంతన్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌రెడ్డి, రమేశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


