అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి

Jan 6 2026 1:56 PM | Updated on Jan 6 2026 1:56 PM

అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి

అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: అసైన్డ్‌ రైతులకు శాశ్వత పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్‌ చేశారు. రేగడి దోస్వాడ, మక్తగూడ గ్రామాల సర్పంచ్‌లు పావని రమణారెడ్డి, మాన నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. రెండు గ్రామాల సర్వే నంబరు 102లో 272 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం చూస్తుందన్నారు. వీటిని ప్రభుత్వం లాక్కోవద్దన్నారు. అసైన్డ్‌ రైతులకు శాశ్వత పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. భూములు లాక్కోవాలని చూస్తే రేగడి దోస్వాడ మరో లగచర్లగా మారుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల సీపీఎం కార్యదర్శి దేవేందర్‌, సర్పంచులు రాములు, శ్రీనివాస్‌, నాయకులు రామచంద్రయ్య, శ్రీనివాస్‌, జంగయ్య, శేఖర్‌, రాజారత్నం, రాజేష్‌, సదానందం, రవి, రైతులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement