గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చేవెళ్ల: గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..ఆదివారం చేవెళ్లలోని ఓ రోడ్డుపక్కన గోడకు ఆనుకొని కదలలేని వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే పోలీసులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అయితే అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు? మృతుని వద్ద కూడా ఎలాంటి గుర్తింపు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు దాదాపు 35నుంచి 45 ఏళ్ల వయసుఉంటుందని, నీలి రంగు షర్టు, ఖాకీ రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 7901099443, 8712554143లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ శిరీష తెలిపారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
దొంగకు రిమాండ్
17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మీర్‌పేట: ద్విచక్ర వా హనాలు దొంగతనం చేస్తున్న వ్యక్తిని మీ ర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌కు చెందిన కొలుపురి శ్రీను (39) మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. అతను వైన్‌షాపులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో, పార్కు చేసిన వాహనాలను చోరీ చేసేవాడు. ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని అదుపులోకి తీసుకుని సంబంధిత వివరాలు సేకరించారు. చేసిన తప్పులను ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


