నిందితులపై కేసు నమోదు చేయాలి
షాద్‌నగర్‌రూరల్: దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ను హత్య చేసి, అందుకు సహకరించిన వారందరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి (కేఏఎన్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగ గోవిందు డిమాండ్ చేశారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలో ఎల్లంపల్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. రాజశేఖర్ హత్యకు ముందు అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ..సంబంధిత హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్‌కు పోలీసు అధికారులు సహకరించడం, మద్దతుగా ఉండటంతోనే రాజశేఖర్‌ను కిడ్నాప్‌చేసి హత్య చేశారని ఆరోపించారు. మృతుడు కిడ్నాప్ జరిగిన వెంటనే ఆయన భార్య వాణి 100కు డయ ల్ చేయడంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారన్నారు. ఈ విషయంలో తక్షణమే పోలీసు లు స్పందించకపోవడం వల్లే రాజశేఖర్ హత్యకు గు రయ్యారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టప్రకారం పరిమిత కాలంలో నేర విచారణ పూర్తిచేసి నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేఏఎన్‌పీఎస్ రాష్ట్ర కోశాధికారి మోహనకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు రామచంద్ర య్య, మధు, బండారిలక్ష్మయ్య పాల్గొన్నారు.
కేఏఎన్‌పీఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందు


