భవిష్యత్ బీజేపీదే
యాచారం: రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు విసుగుచెందారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా వివిధ పార్టీల కార్యకర్తలు ఆదివారం సీనియర్ నాయకులు నడుకుడి కృష్ణ, నాయిని పాండు, శ్రీనగరం రమేశ్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌నాయక్, సీనియర్ నాయకులు అంబోజ్ జగదీష్ యాదవ్, కొండాపురం నాగరాజు, సంగెం శ్రీనాథ్, చౌదర్‌పల్లి మూడో వార్డు సభ్యులు కొమ్ము వసంత, ఏనిమిదో వార్డు సభ్యుడు కావలి కిరణ్‌కుమార్, ఆనంద్, యాదగిరి, ప్రశాంత్, ప్రభాకార్, మల్లేష్, లింగం, పిడుగు యాదగిరి పాల్గొన్నారు.
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్


