సెన్స్‌లేని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వద్దు
ఆమనగల్లు: సెన్స్‌లేని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసీ్త్రయ అలైన్‌మెంట్‌తో గతంలో ఏర్పాటు చేసిన విధంగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం శాటిలైట్ సర్వేతో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి అలైన్‌మెంట్ చేశారని గుర్తుచేశారు. అప్పట్లో ట్రిపుల్‌ఆర్ నిర్మాణం ప్రభుత్వ భూములు, సాగుకు యోగ్యం కాని భూముల నుంచి ఉండేలా చూశారని, రైతులకు ఎక్కువ అన్యాయం జరగకుండా అలైన్‌మెంట్ నిర్ణయించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు నాలుగు సార్లు అలైన్‌మెంట్ మార్చి సన్న, చిన్నకారు రైతుల భూముల నుంచి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కోవడాన్ని తెలంగాణ జాగృతి వ్యతిరేకిస్తోందన్నారు. జనవరి 5న హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 8 జిల్లాల భూ నిర్వాసితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు. 8 జిల్లాలకు చెందిన భూ నిర్వాసితులతో వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు.
డంపింగ్‌యార్డును తరలించాలి
ఆమనగల్లులో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్‌యార్డును తరలించాలని కవిత డిమాండ్ చేశారు. పట్టణంలోని గుర్రంగుట్ట సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నివాస గృహాల మద్య డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు దారమోని గణేశ్, తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
మైసిగండి మైసమ్మ సన్నిధిలో..
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత ఆలయంలో అమ్మవారికి పట్టు చీర, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, షాదనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేశ్‌కుర్మ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిరాథోడ్, మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత


