డిజిటల్ పల్లెలుగా మారాలి
● తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదే
● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
● ఉమ్మడి జిల్లా సర్పంచులకు సన్మానం
శంషాబాద్: ‘మీ గ్రామంలో ప్రతి సమాచారాన్ని మీ పంచాయతీలో కంప్యూటర్‌లో పొందుపర్చండి.. ఎవరికి ఏం కావాలి.. ఏ సంక్షేమం ఎవరికి అందింది.. అందని లబ్ధిదారులెవరు.. అనే ప్రతి సమాచారాన్ని సంక్షిప్తం చేసుకుని వాటి పరిష్కరించే విధంగా పాలన సాగాలి.. అందుకు ప్రభుత్వం మీ వెంట ఉండి అన్ని రకాలుగా ప్రొత్సహిస్తుంది.. మీ గ్రామాలన్నీ డిజిటల్ గ్రామాలుగా మరాలి’ అని ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపర్చి గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సర్పంచులు పనిచేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధితోనే రాష్ట్రం, దేశం బాగుపడుతాయన్నారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు సైతం ఇవ్వకుండా సతాయించిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కనుమరుగు చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇప్పటికే మొదలు పెట్టిందన్నారు. సర్పంచులకు త్వరలోనే శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు ధారాసింగ్, శంషాబాద్ పట్టణ అధ్యక్షుడు పి.సంజయ్‌యాదవ్, మండల అధ్యక్షుడు, నర్కూడ సర్పంచ్ శేఖర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


