తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

తాటిచ

తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి

శంషాబాద్‌ జెడ్సీకి సన్మానం

బొంగ్లూర్‌ గౌడ సంఘం నాయకులు

ఇబ్రహీంపట్నం రూరల్‌: తాటి చెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బొంగ్లూర్‌ గౌడ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో, ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. తాటి చెట్లను నరకివేయడంతో తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 చెట్లకు యజమాని జనార్ధన్‌రెడ్డి గీత కార్మికులకు సమాచారం లేకుండా తొలగించారన్నారు. ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానందంగౌడ్‌, మల్లేశ్‌గౌడ్‌, చంద్రయ్యగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, మూల నర్సింహ, సత్తయ్య, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌: శంషాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రకళను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కె.చంద్రారెడ్డి, నార్సింగి ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ డి.వెంకటేష్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ నీరటి తన్వీ, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు శనివారం ఆమెను కలిసి సత్కరించి బోకేలను అందజేశారు. శంషాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని కోరారు.

భోజనం రూ.5

పార్కింగ్‌కు రూ.90

నిమ్స్‌లో చారాణా కోడికి

బారాణా మసాలా!

సాక్షి, సిటీబ్యూరో: చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఇదేనేమో! నిమ్స్‌లో పార్కింగ్‌ దోపిడీ తీరుకు ఇది అతికినట్టుగా ఉంటుంది. రోగులకు, సహాయకులకు, సందర్శకులకు ఇక్కడ మధ్యాహ్నం భోజనం రూ.5కే లభిస్తుంది. కానీ, వాహనంపై వెళ్తే మాత్రం పార్కింగ్‌కు రూ.30 నుంచి రూ.90 వరకు చెల్లించాల్సిందే. ఇదేమని అడిగితే.. పార్కింగ్‌ ఏజెన్సీ సైన్యం బెదిరింపులకు పాల్పడుతోంది. నగరంలోని ప్రైవేటు, కార్పొ రేట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క నిమ్స్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది. మహాగనరానికే కాకుండా తెలుగు రాష్ట్రాల పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవల కోసం ఎక్కువగా నిమ్స్‌ ఆసుపత్రికే వస్తుంటారు. అనారోగ్యంతో రూ.వేలకు వేలు ఖర్చు చేసుకుని, బతుకుజీవుడా అంటూ అద్దె కార్లల్లో వచ్చేవారికి ఆసరాగా నిలవాల్సిన ఆసుపత్రి యాజమాన్యం పార్కింగ్‌ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. నిత్యం ఓపీ సంఖ్య 3,500 నుంచి 4 వేలు ఉంటుంది. ఇన్‌ పేషెంట్‌ ఇక అదనం. ఆసుపత్రి ఆవరణలో 3 గంటల పార్కింగ్‌ కోసం మోటారుసైకిల్‌కు రూ. 30, కారుకు రూ.90 వసూలు చేస్తున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ సినిమా థియేటర్లు, ఇతర ప్రైవేటు ప్రాంతాల్లో సాధారణంగా మోటారు సైకిల్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తుండగా. నిమ్స్‌లో మాత్రం రూ.30 ఇవ్వాల్సిందే. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అడ్డగోలు దోపిడీపై స్పందించాలని రోగుల సహాయకులు కోరుతున్నారు.

తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి 1
1/1

తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement