సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలి
రాష్ట్ర మంత్రి సీతక్క
ఆమనగల్లు: సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం తలకొండపల్లి మండలం వీరన్నపల్లి సర్పంచ్ కడారి రామకృష్ణ యాదవ్ శనివారం నగరంలోని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్‌ను అభినందించిన సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకా లకు అర్హులకు అందేలా చూడాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉప సర్పంచ్ రాఘవేందర్, మాజీ సర్పంచ్ లింగం గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, వినయ్, అనిల్ తదితరులున్నారు.
సిమెంట్ ట్యాంకర్
ఢీకొని మహిళ మృతి
పరిగి: సిమెంట్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన శనివారం పరిగి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రంగంపల్లికి చెందిన లక్నాపురం సాయిలమ్మ (45) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్న కుమారుడు మహేశ్ తుంకుల్‌గడ్డ సమీపంలోని సిమెంట్ రింగులు తయారు చేసే వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. మధ్యాహ్నం ఆమె కొడుకు వద్దకు వెళ్లి వస్తుండగా కొడంగల్–హైదరాబాద్ వైపు ప్రయాణి స్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపారు.


