కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య
కొందుర్గు: కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముట్పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పార్వతమ్మ(55)కు శోభారాణి, మంజుల ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నతనంలోనే పార్వతమ్మ భర్త కిష్టయ్య మృతిచెందాడు. దీంతో అన్నీ తానై కష్టపడి ఇద్దరినీ పెంపి, పోషించి వివాహాలు చేసింది. ఇదిలా ఉండగా చిన్న కూతురు మంజుల తన భర్తతో ఏర్పడిన విభేదాలతో ఇటీవలే విడాకులు తీసుకుంది. దీంతో పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 28న చిన్న కూతురు మంజుల చెక్కలోనిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు శోభారాణికి ఫోన్ చేసి, మంజుల గురించి బాధపడింది. అనంతరం మూడు రోజుల తర్వాత పార్వతమ్మ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉండటంతో స్థానికులు శోభారాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కూతుళ్లు వచ్చి చూడగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. పెద్దకూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గొడవలు చేస్తే కేసులు పెడతాం
● సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి
● 71 మంది పాత నేరస్తుల బైండోవర్
తాండూరు రూరల్: స్థానిక ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరన్‌కోట్ ఠాణా సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు కాల్ చేయాలని చెప్పారు. రూరల్ పోలీస్ సర్కిల్లో నాలుగు మండలాలు పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ ఠాణాలు కలిపి 71 మంది పాత నేరస్తులు, హత్య కేసుల్లో నిందితులను తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశామని తెలిపారు.
26 సమస్యాత్మకమైన గ్రామాలు
తాండూరు మండలంలో సంగెంకలాన్, కరన్‌కోట్, మల్కాపూర్, చెంగోల్, సిరిగిరిపేట్, అల్లాపూర్, జినుగుర్తి గ్రామాలు. యాలాలలో అగ్గనూర్, జుంటుపల్లి, దెవనూర్, రాస్నం, కోకట్ గ్రామాలు. పెద్దేముల్లో మంబాపూర్, హన్మపూర్, ఇందూర్, జనగాం, తట్టెపల్లి, పెద్దేముల్, నాగులపల్లి. బషీరాబాద్‌లో దామర్‌చెడ్, నవల్గా, ఎక్మాయి, మైల్వార్, పర్వత్‌పల్లి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామని సీఐ పేర్కొన్నారు.
కఠిన చర్యలు
యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. అనవసర పోస్టులు చేస్తే.. గ్రూపు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శంషాబాద్: హైదరాబాద్ నుంచి జైపూర్ విమానం అర్ధరాత్రి మూడుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం అర్థరాత్రి 6ఈ–913 జైపూర్ ఎళ్లేందుకు ప్రయాణికులు ఎక్కి కూర్చునున్నారు. నిర్వహణ పరమైన సమస్యల కారణంగా విమానం టేకాఫ్ తీసుకోకుండా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు కిందకు దిగారు. మూడు గంటల తర్వాత విమానం తిరిగి 235 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరింది.
ప్రయాణికుడికి అస్వస్థత..
హైదరాబాద్ నుంచి ఈతేహాద్ ఎయిర్‌లైన్స్ అబుదాబి వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున చెక్‌ఇన్ కౌంటర్ వద్దకు వచ్చిన ప్రయాణికుడు(36) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రయాణానికి అనుకూలంగా లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అతడితోపాటు అతడి సహాయకారిగా ఉన్న వ్యక్తి ప్రయాణాన్ని రద్దు చేసిన తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరింది.


