
కలం తీసుకో.. రాత మార్చుకో
మొయినాబాద్: బ్రహ్మదేవుడు ఎవరి తలరాత ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు.. కానీ చిలుకూరు బాలాజీ సన్నిధిలో పెన్ను తీసుకుని నీ తలరాతను నువ్వే మార్చుకో అని అంటున్నారు అర్చకుడు సురేష్‌స్వామి. ఆదివారం ఆయన ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో స్వామివారి దర్శనం అనంతరం పిల్లలకు పెన్నులు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ దర్శనానికి వచ్చిన చిన్నారులకు స్వామివారి ప్రసాదంగా పెన్నులు అందజేస్తే.. వారికి విశ్వాసం పెరిగి, చదువుపై మమకారం పెరుగుతుందని, అందుకే కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాని తెలిపారు. ఆలయాల్లో బాలబాలికలకు ప్రాధాన్యత పెరగాలని.. దేశ భవిష్యత్‌కు వారే నిర్మాతలవుతారని ఆకాంక్షింస్తున్నామని పేర్కొన్నారు.
బాలాజీ సన్నిధిలో పెన్నుల పంపిణీ