
కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐగా..
యాచారం: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ప్రస్తుతం అదే శాఖలో ఎస్‌ఐగా ఉన్నతికి చేరుకుంది మండల పరిధి నందివనపర్తి అనుబంధ గ్రామం పిల్లిపల్లికి చెందిన అయ్యాగాని ప్రవళిక. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. బీపార్మసి పూర్తి చేసింది. తాజాగా వెలువడిన గ్రూపు– 2లో రాణించి, ఎస్‌ఐగా ఎంపిౖకైంది. గతంలో గ్రూప్– 4లో వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్– 1లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రవళిక తల్లిదండ్రులు పాండు, శోభలు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.