
కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు
మహేశ్వరం/కొత్తూరు: ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూనే.. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలగన్నారు. కష్టపడ్డారు. ఫలితం దక్కించుకున్నారు. వారిలో ఒకరు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికగా, మరో ఇద్దరు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ఏఎస్‌ఓగా ఒకరు, ఎస్‌ఐగా మరొకరు ఎంపికయ్యారు. నగరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తదితర అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొన్నారు.
పేద రైతు కుటుంబంలో..
పేద రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదివాడు. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 171 ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యో గం సాధించాడు గిరిజన బిడ్డ దేవేందర్. మండల పరిధి పెద్దమ్మ తండా అనుబంధ నల్లచెర్వుతండా కు చెందిన కాట్రావత్ లక్ష్మీ– రాములు నాయక్ దంపతుల కుమారుడు దేవేందర్ నాయక్ శనివారం రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో రెవె న్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందే.. దేవేందర్ గ్రూప్– 3లో 305 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించారు. గ్రూప్– 4లో 141వ ర్యాంకు సాధించి, శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1లో 433 మార్కులు సాధించినప్పటికీ.. కొద్దిపాటి తేడాతో అదృష్టం చేజారింది. అయినా నిరుత్సాహం చెందకుండా.. డీటీ కొలువు సాధించాడు.
గ్రూప్–2లో మెరిసిన ఉద్యోగులు
జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికై న దేవేందర్
కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ..ఏఎస్‌ఓగా ఉమ